News June 28, 2024

కృష్ణా: అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి అనిత

image

రాష్ట్రంలో వర్షాలు, వరద ముంపు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో 8 జిల్లాల కలెక్టర్లు, DROలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అనంతరం ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్‌ను అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా అలర్ట్ సెంటర్ విధులను అక్కడి అధికారులు ఆమెకు వివరించారు.

Similar News

News September 20, 2024

విజయవంతంగా ముగిసిన టూరిజం కాన్‌క్లేవ్-2024

image

విజయవాడ నోవాటెల్ హోటల్‌లో జరిగిన “ఏపీ- వియత్నాం టూరిజం కాన్‌క్లేవ్- 2024” శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సదస్సులో వియత్నాం తరపున ముఖ్య అతిథిగా హాజరైన హెచ్.ఈ.ఎంగ్యూయేన్‌కు రాష్ట్రంలోని పర్యాటక రంగ అంశాలను మంత్రి దుర్గేష్ వివరించారు. భవిష్యత్తులో ఏపీ- వియత్నాం మధ్య పర్యాటక, సాంస్కృతిక బదిలీకి మరింత బలం చేకూర్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని హాజరైన వియత్నాం ప్రతినిధులు హామీ ఇచ్చారు.

News September 20, 2024

విజయవాడలో వ్యభిచారం

image

బాడీ మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. మాచవరం సీఐ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రినగర్‌లో బాడీ మసాజ్ పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం దాడి చేశామన్నారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలను, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News September 20, 2024

అడుసుమిల్లి మృతిపై జగన్ దిగ్భ్రాంతి

image

మాజీ ఎమ్మెల్యే, రాజ‌కీయ విశ్లేష‌కులు అడుసుమిల్లి జ‌య‌ప్రకాశ్ మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జై ఆంధ్ర ఉద్యమం, స‌మైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆయ‌న కీల‌కపాత్ర పోషించారని జ‌గ‌న్ గుర్తు చేసుకున్నారు. జ‌య‌ప్రకాశ్ కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు.