News March 11, 2025
కృష్ణా: అనాధల సంరక్షణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

శిశు గృహాల్లో ఉంటున్న అనాధ పిల్లలను కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) పోర్టల్ ద్వారా దత్తత తీసుకునేందుకు వీలుగా అందులో పిల్లల వివరాలను అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బాలల సంక్షేమ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, డీఈఓ ఎం.జె రామారావు ఉన్నారు.
Similar News
News March 11, 2025
జాతీయ స్థాయిలో జిల్లా పేరును మార్మోగించిన అరుణ

మాస్టర్స్ అథ్లెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన నేషనల్ లెవెల్ క్రీడల్లో గూడూరు పాఠశాల ఉపాధ్యాయిని మత్తి అరుణ తన అసామాన్య ప్రతిభను చాటారు. బెంగళూరులో జరిగిన ఈ పోటీల్లో 4×400 మీటర్స్ రన్నింగ్‌లో మొదటి స్థానంలో గోల్డ్ మెడల్, 4×100 మీటర్స్ రన్నింగ్‌లో సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పేరు జాతీయ స్థాయిలో మార్మోగేలా చేశారని తోటి ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.
News March 10, 2025
MTM: ప్రజల అర్జీల పట్ల శ్రద్ధ వహించాలి- కలెక్టర్

ప్రజల నుంచి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరెట్ ప్రాంగణంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులను వాటిని సకాలంలో పరిష్కరించాలని సూచించారు.
News March 10, 2025
బాపులపాడులో అధిక ఉష్ణోగ్రతలు.. తగ్గని వేడి.!

కృష్ణా జిల్లా గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో నేడు బయట ఎండ తీవ్రత కనిపించకపోయినా, ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గలేదు. బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో 35 డిగ్రీలు, గన్నవరంలో 36 డిగ్రీలు నమోదయ్యాయి. పైగా గాలిలేని వాతావరణం ఉక్కపోతను మరింత పెంచింది. “గాలి లేక అసలే ఉమ్మటేసింది!” అని స్థానికులు అంటున్నారు.