News February 10, 2025
కృష్ణా: ‘ఇంటికి రమ్మని చెప్పి.. అఘాయిత్యం’

కంచికచర్లలో విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బీటెక్ చదువుతున్న విద్యార్థిని హుస్సేన్, ప్రేమించుకున్నారు. హుస్సేను ఆమెను ఇంటికి రమ్మని పిలిచి తన స్నేహితులను రప్పించి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశారు. అరుపులు వినపడకుండా టీవీ సౌండ్ పెట్టారు. ఎవరికైనా చెప్తే వీడియోలు బయటపెడతామన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు.
Similar News
News March 14, 2025
బాపులపాడులో రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం వద్ద చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
News March 14, 2025
ఘంటసాల: బ్రతుకు తెరువు కోసం వస్తే బ్రతుకులు తెల్లారాయి

పొట్టకూటి కోసం కోటి కష్టాలని.. బ్రతుకుదెరువు కోసం ప.గో జిల్లా కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామం నుంచి ఇద్దరు బొలెరో వాహనంలో వచ్చారు. రొయ్య పిల్లలు తీసుకొని చల్లపల్లి మీదుగా స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఘంటసాల (మ) జీలగలగండి వద్ద నిద్రమత్తులో డ్రైవర్ లారీని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వాహనాల్లో చిక్కుకున్న మృతదేహాలు బయటికి తీయడానికి పోలీసులు శ్రమించారు.
News March 14, 2025
MTM: గవర్నర్‌ని కలిసి కృష్ణా విశ్వవిద్యాలయం VC

కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయాల కులపతి అబ్దుల్ నజీర్‌ను రాజ్ భవన్లో శుక్రవారం కలిశారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహణకు గవర్నర్ నుంచి అనుమతి కోరారు.