News February 2, 2025

కృష్ణా: ఎన్నికల నిర్వహణకు నిస్పక్షపాతంగా సహకరించాలి- కలెక్టర్

image

ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌లను నిస్పక్ష‌పాతంగా, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు రాజ‌కీయ పార్టీలు స‌హ‌క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ కోరారు. శ‌నివారం కలెక్టరేట్‌లో ఆయన తన ఛాంబర్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ నిర్వహణపై వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News March 14, 2025

కృష్ణా: హోలీ సందర్భంగా ఎస్పీ హెచ్చరిక

image

ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆహ్లాదకర వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు. హోలీని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ప్రజా జీవనానికి అంతరాయం కలిగించినా, బహిరంగ ప్రదేశాలలో రంగులు చల్లి ఇతరులకు ఇబ్బంది కలిగించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

News March 14, 2025

గన్నవరం: వల్లభనేని వంశీని వదలని కేసులు 

image

వల్లభనేని వంశీపై నమోదైన 2 కేసుల్లో గురువారం పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గన్నవరం, ఆత్కూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో, పోలీసులు గన్నవరం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీపై, ఈ కేసుల్లో విచారణ చేపట్టేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు. కేసుల విచారణ కోసం త్వరలోనే వంశీని కోర్టు ముందుకు హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

News March 14, 2025

వైసీపీ మహిళా విభాగం కృష్ణాజిల్లా అధ్యక్షురాలిగా భారతి

image

వైసీపీ మహిళా విభాగం కృష్ణాజిల్లా అధ్యక్షురాలిగా శీలం భారతి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. భారతీ మచిలీపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా వ్యవహరిస్తున్నారు. భారతి నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. తన నియామకానికి కృషి చేసిన మాజీ మంత్రి పేర్ని నానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

error: Content is protected !!