News May 10, 2024

కృష్ణా: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కన్వీనర్ గౌరీ మణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు, 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు జూన్ 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను iti.ap.gov.in వెబ్ సైట్ ద్వారా సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 08674-295953, 8555 952320 నెంబర్లను సంప్రదించాలన్నారు.

Similar News

News April 22, 2025

కృష్ణా: ‘ఈ- కేవైసీ చేయకపోతే రేషన్ అందదు’

image

రేషన్ కార్డు లబ్ధిదారులు ఏప్రిల్ 30లోపు కేవైసీ పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సూచించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. జిల్లాలో 71,110 మంది ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. 5 ఏళ్లు లోపు, 80 ఏళ్లు పైబడినవారికి మినహాయింపు ఉందన్నారు. సంబంధిత వివరాలు డీలర్లు, తహసీల్దార్ల వద్ద ఉన్నాయని, గడువు మించినవారికి పథకాల లబ్ధి ఉండదని హెచ్చరించారు.

News April 22, 2025

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

image

పెనమలూరు మండలం పెద్దపులిపాకలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ రాజేష్ (29) విజయవాడ ఆటోనగర్లో వెల్డింగ్ పని చేసేవాడు. కొంతకాలం నుంచి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పెదపులిపాకలోని తన ఇంట్లో సోమవారం సాయంత్రం రాజేశ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 22, 2025

కృష్ణా : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు – DRO

image

కృష్ణా జిల్లాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన ఛాంబర్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు.10 పరీక్షా కేంద్రాల్లో 4546 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.

error: Content is protected !!