News March 24, 2025
కృష్ణా: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడవద్దు: ఎస్పీ

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని నమ్మి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడవద్దని ఎస్పీ ఆర్. గంగాధరరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బెట్టింగ్ యాప్స్ మోసపూరితమైన వల అని, అందులో చిక్కుకొని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ఐపీఎల్, టీ 20 క్రికెట్ మ్యాచ్లను ఆసరాగా తీసుకొని అమాయకులను బలి చేస్తున్నారని అన్నారు.
Similar News
News March 30, 2025
కృష్ణా జిల్లా TODAY TOP NEWS

☞ గన్నవరం: 3 గంటలసేపు వంశీని విచారించిన పోలీసులు☞ కృష్ణా: క్రికెట్ బెట్టింగ్ గుర్తు రట్టు☞ రేపు ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌కు సీఎం☞ కృష్ణా: పెరుగుతున్న ఎండలు.. ఆందోళనలో ప్రజలు ☞ కృష్ణా: MBA,MCA ఫలితాలు విడుదల☞ పెదకళ్ళేపల్లి చెరువులో పడిన మహిళ గుర్తింపు☞ కూచిపూడి జిల్లాలో ఉండటం గర్వ కారణం: కలెక్టర్☞ ఆత్కూర్ వద్ద గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
News March 29, 2025
అవనిగడ్డ: IPL బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

అయ్యప్ప నగర్‌లో లోకేశ్ ఆత్మహత్యతో IPL బెట్టింగ్ ముఠాల వ్యవహారం బయటపడింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. దర్యాప్తులో అవనిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్ కీలక నిందితుడిగా బయటపడ్డాడు. అతడి బ్యాంక్ ఖాతాల్లో లక్షలాది రూపాయలున్నట్లు గుర్తించారు. బుకీలను పట్టుకునేందుకు పోలీసులు క్షుణ్ణంగా విచారణ కొనసాగిస్తున్నారు.
News March 29, 2025
కృష్ణా: MBA,MCA పరీక్ష ఫలితాలు విడుదల

కృష్ణ యూనివర్సిటీ (KRU) పరిధిలో ఇటీవల నిర్వహించిన MBA,MCA కోర్సుల 1, 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలపై అధికారిక వెబ్ సైట్ చెక్ చేసుకోవాలని KRU సుచించింది. రీవాల్యుయేషన్ కై ఏప్రిల్ 15 లోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.