News April 5, 2025

కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా జాయింట్ కలెక్టర్ 

image

కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయ సంస్థలకు ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్‌లను పర్సన్ ఇన్‌ఛార్జ్‌లుగా ప్రభుత్వం నియమించింది. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి రవి కుమార్ పాల్గొన్నారు. 

Similar News

News April 5, 2025

గన్నవరం: మహిళల్ని రక్షించబోయి మేస్త్రీ మృతి

image

గన్నవరం మండలం మాదలవారిగూడెంలో స్లాబ్ పనిలో విషాదం చోటుచేసుకుంది. ఆగిరిపల్లి చెందిన కాంక్రీట్ మేస్త్రీ పిల్లిబోయిన కొండలు (35) కూలీలతో కలిసి స్లాబ్ వేస్తున్నారు. ఆ సమయంలో సిమెంట్ తీసుకెళ్లె లిప్ట్ ఒక్కసారిగా తెగి కింద పడింది. అక్కడే మహిళల్ని తప్పించబోయి ఏడుకొండలు లిఫ్ట్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2025

కృష్ణా: వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై సోమవారం తీర్పు

image

గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై సోమవారం తీర్పు వెలువడనుంది. ఉంగుటూరు మండలం ఆత్కూరులో 8 ఎకరాల భూమి కబ్జా చేశారని వంశీపై కేసు నమోదు అయింది. వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌పై వాదనాలు పూర్తి అయ్యాయి. వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై సోమవారం కోర్టు తీర్పు వెలువరించనుంది.

News April 4, 2025

కృష్ణా: AR కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం 

image

విధి నిర్వహణలో మృతిచెందిన ఏ‌ఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు భార్య వీరమల్లు రాజేశ్వరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది. ఆమెను జిల్లా పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఎస్పీ ఆర్. గంగాధరరావు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. 

error: Content is protected !!