News April 8, 2025
కృష్ణా జిల్లాలో 37 మందికి గ్రేడ్-3 కార్యదర్శులుగా పదోన్నతి

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 37 గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తున్న 19 మంది, జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న 18 మంది జూ.అసిస్టెంట్లను గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సంబంధిత పదోన్నతులు పొందిన కార్యదర్శులకు కలెక్టర్ అందజేశారు.
Similar News
News April 19, 2025
క్రికెట్ బెట్టింగ్.. చల్లపల్లిలో ఏడుగురు అరెస్ట్

చల్లపల్లిలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిని పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ ఆదేశాల మేరకు సీఐ ఈశ్వరరావు పర్యవేక్షణలో విస్తృత తనిఖీలు నిర్వహించి ఎనిమిది మంది క్రికెట్ బెట్టింగ్ జూదరులను గుర్తించినట్లు తెలిపారు. వారిలో ఏడుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
News April 19, 2025
గన్నవరం: లారీ డ్రైవర్‌కు గుండె పోటు.. ఇద్దరి దుర్మరణం

విజయవాడ గన్నవరం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గన్నవరం నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ డ్రైవర్‌కు ప్రసాదం పాడు వద్ద గుండెపోటు రావడంతో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. ఫుట్ పాత్‌పై లారీ దూసుకెళ్లడంతో నడుచుకొని వెళ్తున్న రామసాయి(18) స్పాట్లోనే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పామర్రుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
News April 18, 2025
గుణదలలో షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు

కృష్ణాజిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల బాలికల షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు ఏప్రిల్ 21న గుణదలలో నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి గోగులమూడి విజయ్ కుమార్ తెలిపారు. ఈ పోటీలకు ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్ జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు. ఇక్కడ ఎంపికైన వారు మదనపల్లిలో ఈనెల 25, 26 తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.