News March 6, 2025

కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

image

★ గన్నవరంలో వాయిదా పడిన పవన్ పర్యటన ★ కృష్ణా జిల్లాలో 40 డిగ్రీలు ఎండ★ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 సర్వే : కలెక్టర్ ★ మొవ్వ: రాజీకి పిలిచి.. హత్య ★ VJA: `సాఫ్వేర్ ఉద్యోగి కాదు అమ్మాయిల బ్రోకర్’★ గన్నవరం: తీవ్రమవుతున్న వెటర్నరీ విద్యార్థులు నిరసనలు★ గూడూరు వద్ద ప్రమాదం.. డ్రైవర్ మృతి★ ఉయ్యూరు: ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్ నోట్

Similar News

News January 1, 2026

కృష్ణా: కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం

image

నూతన సంవత్సర వేడుకలు జిల్లాలో అంబరాన్ని అంటాయి. గత సంవత్సరం స్మృతులను గుర్తు చేసుకుని కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరం 2026కు యువత స్వాగతం పలికారు. ఉదయమే ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలని కోరుకున్నారు. కొంతమంది మంచి సంకల్పంతో నూతన సంవత్సరం తొలి రోజును ప్రారంభించారు.

News January 1, 2026

కృష్ణా జిల్లాలో మహిళలపై నేరాలకు బ్రేక్

image

కృష్ణా జిల్లాలో మహిళల భద్రత దిశగా సానుకూల మార్పు కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. పోక్సో కేసులు 133 నుంచి 77కి తగ్గి 42 శాతం తగ్గుదల నమోదు కాగా, మహిళలపై మొత్తం నేరాలు 914 నుంచి 669కి చేరి 27 శాతం తగ్గాయి. పోలీసుల కఠిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.

News January 1, 2026

మాదకద్రవ్యాలపై కృష్ణా జిల్లా పోలీసుల ఉక్కుపాదం

image

ఎన్‌డీపీఎస్ చట్టం కింద మాదకద్రవ్యాల నియంత్రణలో కృష్ణా జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. 2024లో 428.833 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, 2025లో 475.261 కిలోల గంజాయి, 1 గ్రాము కోకైన్, 116 గ్రాముల సిరప్‌తో పాటు ఒక గంజాయి మొక్కను పట్టుకున్నారు. మాదకద్రవ్యాల కేసుల్లో అరెస్టైన వారి సంఖ్య 133 నుంచి 150కి పెరిగింది. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.