News January 26, 2025
కృష్ణా జిల్లాలో నేడు ఆ రెండు బంద్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం మద్యం, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం ఉదయం తెరుచుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం, మాంసం విక్రయించే దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశాయి. నేడు ఆదివారం కావడంతో మందు, ముక్కతో వీకెండ్‌ను ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని పలువురు అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Similar News
News January 27, 2025
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్ఓ చంద్రశేఖరరావులు కూడా అర్జీలు స్వీకరించారు.
News January 27, 2025
గుడివాడ: కొత్త ఆటోలో తీసుకెళ్లి ప్రాణం కాపాడాడు..!
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లి కాపాడిన ఆటో డ్రైవర్ కందుల శ్యామ్‌కు ఏలూరు కలెక్టర్ రూ.5వేలు, ప్రాణ దాత అవార్డు అందజేశారు. లింగాల గ్రామానికి చెందిన కాటి నిరీక్షణ బాబు కానుకొల్లు వద్ద నవంబరు 28న బైకుపై వెళ్తూ అదుపుతప్పి కిందిపడిపోయాడు. అటుగా ఫ్యామిలీతో కొత్త ఆటోలో వస్తున్న కందుల శ్యామ్, నల్లగుడ్ల రాజు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాబును గుడివాడ ఆసుపత్రిలో చేర్చారు.
News January 27, 2025
పెనమలూరు: ఈడుపుగల్లు సర్పంచ్‌కి కేంద్ర అవార్డు
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు సర్పంచ్ పందింటి ఇందిర ఆదివారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ పురస్కారం అందుకున్నారు. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ (లల్లన్ సింగ్ ), సహాయ మంత్రి ఎస్. పి సింగ్ భగేల్ చేతులు మీదుగా గణతంత్ర వేడుకలలో భాగంగా ఢిల్లీలో ఇందిరకు ఉత్తమ సర్పంచ్ అవార్డును అందజేశారు.