News February 18, 2025

కృష్ణా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నేటి నుంచే పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలు నమోదయ్యే సూచనలు కన్పిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నిన్న మచిలీపట్నంలో 33 డిగ్రీలు నమోదు అయినట్లు తెలిపారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News February 21, 2025

కృష్ణాజిల్లా నేటి ముఖ్యాంశాలు

image

*కృష్ణా: డీజీపీకి లేఖ రాసిన పేర్ని నాని. *కృష్ణాజిల్లా పోలీసులను అభినందించిన హోంమంత్రి. *కృష్ణా జిల్లాలో మొదటి జీబీఎస్ కేసు. *అమలాపురం లాడ్జిలో పోరంకి డాక్టర్ మృతి. * ఉయ్యూరులో మద్యం మత్తులో వీరంగం. *కృష్ణా: APK ఫైల్ క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళి. *గన్నవరం: వంశీ కేసులో పిటిషన్ వాయిదా.

News February 21, 2025

డీజీపీకి లేఖ రాసిన పేర్ని నాని

image

డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు మాజీ మంత్రి పేర్నినాని లేఖ రాశారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అక్రమ కేసుల వెనుక ఉన్న కోణాన్ని తెలుసుకోవాలని, బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డీజీపీని కోరారు.

News February 21, 2025

కృష్ణాజిల్లా పోలీసులకు హోం మంత్రి అభినందనలు

image

కృష్ణాజిల్లా పోలీసులను హోం మంత్రి అనిత అభినందించారు. ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా ప్రశంసించారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం ముస్తాబాద్ బాలికలు అదృశ్యమైన ఘటనలో పోలీసుల స్పందించిన తీరును ఆమె మెచ్చుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు, సత్తెనపల్లి DSP, సీఐలకు ఫోన్ చేసి అభినందించినట్లు ఆమె Xలో పోస్ట్ చేశారు. 

error: Content is protected !!