News April 20, 2024
కృష్ణా: ట్రేడింగ్ పేరుతో మోసం.. రూ.35 లక్షలు స్వాహా

ఆన్లైన్‌లో ట్రేడింగ్ చేసి రూ.35 లక్షలు మోసపోయానంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నమోదు చేశారు. పోరంకికి చెందిన శ్రీకాంత్ ఆన్లైన్ ట్రేడింగ్‌లో సుమారు రూ.35 లక్షలు పెట్టుబడి పెట్టారు. తనకు డబ్బు అవసరమై విత్ డ్రా చేద్దామని అడగ్గా.. రెండు రోజుల పడుతుందని వారు తెలిపి అతని ఖాతాను బ్లాక్‌లో పెట్టారన్నాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News April 21, 2025
కృష్ణా: ‘నేడు కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమం’

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు(సోమవారం) కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంటుందన్నారు.
News April 20, 2025
కృష్ణా: LLB పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన LLB 3వ, 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం సూచించింది.
News April 20, 2025
పెనమలూరు: రూ. 22 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న తాడిగడపకు చెందిన నూకల విజయశ్రీని సైబర్ నేరగాళ్లు భారీ మోసం చేశారు. ఆన్‌లైన్ టాస్కుల పేరుతో గ్రూపుల్లో చేర్చి, పెట్టుబడికి అధిక లాభాలంటూ నమ్మబలికిన నేరస్తులు దశలవారీగా ఆమె నుంచి రూ.22 లక్షలు దోచుకున్నారు. స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.