News March 24, 2024
కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక
కృష్ణా వర్సిటీ పరిధిలోని డిగ్రీ (2020- 21 బ్యాచ్) విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 2 నుంచి 18 వరకు ఈ పరీక్షలు నిర్ణీత తేదీల్లో జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, పరీక్షల టైం టేబుల్ పూర్తి వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం స్పష్టం చేసింది.
Similar News
News January 2, 2025
MTM : కానిస్టేబుల్ అభ్యర్థి మృతికి కారణాలివే.!
మచిలీపట్నంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో ఎ.కొండూరుకు చెందిన దారావత్ <<15046039>>చంద్రశేఖర్ (25) మృతి చెందడం<<>>పై పోలీసులు వివరణ ఇచ్చారు. కార్డియాటిక్ అరెస్ట్‌తో మరణించినట్లు వైద్యులు వెల్లడించారన్నారు. ప్రాథమికంగా పరీక్షలు చేసిన రిపోర్టుల్లో అతనికి SEPSIS కారణంగా WBC కౌంట్ 30వేలకు చేరిందన్నారు. అతను గత 5 రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోందని వైద్యులు తెలిపారు.
News January 2, 2025
విజయవాడ: వైసీపీ నేతకు సుప్రీంలో ఊరట
వైసీపీ నేత, రాష్ట్ర ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు గౌతమ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది.
News January 2, 2025
నాకేం తెలియదు.. పోలీసుల విచారణలో జయసుధ
రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి పోలీసుల విచారణకు హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ గుట్టు విప్పలేదు. నిజం రాబట్టేందుకు పోలీసులు క్లిష్ట ప్రశ్నలు సంధించినా ఆమె నోరు విప్పలేదని తెలుస్తోంది. గోడౌన్ నిర్వహణ వ్యవహారాలన్నీ తమ మేనేజరే చూసుకునే వారని, తనకేమీ తెలియదని విచారణాధికారికి చెప్పినట్టు సమాచారం. జయసుధ నుంచి ఆశించిన సమాచారం రాకపోవడంతో ఆమెను మరోసారి విచారించే అవకాశం కనిపిస్తోంది.