News June 3, 2024
కృష్ణా: నిఘా నీడలో ఓట్ల లెక్కింపు

కృష్ణా విశ్వవిద్యాలయంలో జరగనున్న కౌంటింగ్ భద్రతా ఏర్పాట్లలో భాగంగా 110 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లతో సహా ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి క్షణం సీసీ కెమెరాల ద్వారా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా సిబ్బంది నియామకాన్ని అధికారులు చేపట్టారు.
Similar News
News December 16, 2025
పేకాట శిబిరాలకు కృష్ణా జిల్లా అడ్డాగా మారుతోందా.?

పేకాట శిబిరాలకు కృష్ణా జిల్లా వేదికగా మారుతోందా.? అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. జూద క్రీడలు రోజు రోజుకు విస్తరిస్తుండటంమే దీనికి నిదర్శనం. పేకాట వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. జిల్లా ఎస్పీ జూద శిబిరాలపై, యాంటీ డ్రగ్ నిర్మూలనపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ, కింది స్థాయి సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News December 16, 2025
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు

కృష్ణా జిల్లా పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఆధార్ ప్రత్యేక క్యాంపులు మంగళవారం నుంచి నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. నవంబర్‌లో నిర్వహించిన క్యాంపుల కొనసాగింపుగా ఈ నెల 16 నుంచి 20 వరకు, అలాగే 22 నుంచి 24 వరకు క్యాంపులు జరుగుతాయని పేర్కొంది. బయోమెట్రిక్ అప్‌డేట్ మిగిలి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
News December 16, 2025
ఈ నెల 21న పల్స్ పోలియో: కలెక్టర్

ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముద్రించిన పల్స్ పోలియో కార్యక్రమ గోడపత్రికలను సోమవారం ఆయన కలెక్టరేట్ లో నిర్వహించారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకై పోలియో చుక్కలు తప్పక వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.


