News January 18, 2025
కృష్ణా: పరీక్షా ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు- 2024లో నిర్వహించిన ఫార్మ్-డీ కోర్సు 1, 4వ ఏడాది రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకు అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.
Similar News
News January 18, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూతన డీఎస్పీలు వీరే
ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూతనంగా పలువురు డీఎస్పీలకు పోస్టింగ్‌లు ఇస్తూ శుక్రవారం రాత్రి డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీచేశారు. విజయవాడ సౌత్ ఏసీపీగా దేవినేని పవన్ కుమార్, గుడివాడ డీఎస్పీగా ధీరజ్ వినీల్ అవనిగడ్డ డీఎస్పీగా తాళ్లూరు విద్యశ్రీ ను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని ఉత్తర్వులు పేర్కొన్నారు.
News January 18, 2025
కలిదిండి: మాజీ సర్పంచ్‌ది ప్రమాదం కాదు.. హత్య
కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం సంతోషపురం మాజీ సర్పంచ్ కాలవ నల్లయ్యది ప్రమాదం కాదని హత్యేనని పోలీసులు నిర్ధారించారు. పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బోధన శీను పథకం ప్రకారం గురువారం సాయంత్రం దాడి చేసి హతమార్చినట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. హత్య కేసుగా నమోదు చేసి నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ వివరించారు.
News January 18, 2025
కృష్ణా, NTR జిల్లాలపై చంద్రబాబు సంతృప్తి
సీఎం చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిలో కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఛార్జుల మంత్రులు, ఎంపీల పనీతీరు, జిల్లాలో పథకాల అమలు, తదితర వాటిలో ర్యాంకులు ఇచ్చారు. సరిగా పనిచేయని పలువురి మంత్రులను హెచ్చరించారు.