News December 30, 2024
కృష్ణా: పీజీ పరీక్షల ఫలితాలు విడుదల
కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) 2వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/pg-2-semester-results/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.
Similar News
News January 4, 2025
గుడివాడ: CRPF జవాన్ మృతి..కన్నీటి ఎదురుచూపులు
అరుణాచలప్రదేశ్లో సీఆర్పిఎఫ్ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ గుడివాడకు చెందిన కర్ర రామకృష్ణ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. భౌతిక కాయం రావడానికి మరొక రోజు ఆలస్యం అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు రావలసిన భౌతికకాయం వాతావరణం అనుకూలించక ఫ్లైట్ రద్దు అవ్వడంతో ఆలస్యమైందన్నారు. 5వ తేదీ బంటుమిల్లిరోడ్డులోని ఆయన నివాసం వద్దకు తీసుకురానున్నట్లు తెలిపారు.
News January 4, 2025
విజయవాడ : B.tech విద్యార్థి మృతి
విజయవాడలోని ఓ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి కళ్యాణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కాగా గత వారం రోజుల క్రితం విద్యార్థిని HOD మందలించడంతో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ .. మృతి చెందగా యాజమాన్యం కాలేజీకి సెలవు ప్రకటించింది. కారణమైన హెచ్.ఓ.డి. ని సస్పెండ్ చేసినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News January 4, 2025
VJA: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు భవానీపురం పోలీసులు తెలిపారు. శుక్రవారం గొల్లపూడి సచివాలయం సెంటర్లో జరిగిన ప్రమాదంలో అతను మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే అతను ఎవరనేది తెలియలేదని.. గుర్తిస్తే భవానిపురం పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.