News March 24, 2024
కృష్ణా: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షల టోకరా
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ వద్ద నుంచి రూ.70 లక్షలు వసూలు చేసి మోసగించిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ద్రొనదుల రాజేశ్ (40) ఆన్లైన్ ట్రేడర్. మ్యాట్రిమోని ద్వారా ఓ మహిళను పరిచయం చేసుకున్న ఇతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.
Similar News
News December 28, 2024
VJA: మైనర్ బాలికపై అత్యాచారం.. యువకుడు అరెస్ట్
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. సీఐ కొండలరావు తెలిపిన సమాచారం మేరకు.. చిట్టినగర్‌కు చెందిన ఓ మైనర్ బాలిక(14)ను వించిపేటకు చెందిన చెన్నా రవీంద్ర అనే యువకుడు మాయమాటలు చెప్పి ఈనెల 26న అత్యాచారం చేసినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కొండలరావు తెలిపారు.
News December 28, 2024
కృష్ణా: పరీక్షల టైం టేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీ.ఆర్క్) కోర్స్ 5వ ఏడాది చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 7, 9 తేదీలలో ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పరీక్షల విభాగ కంట్రోలర్ ఏ.శివప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడాలన్నారు.
News December 27, 2024
సమ్మిళిత వృద్ధి సాధనలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాలి: కలెక్టర్
స్వర్ణాంధ్ర 2047 సాకారం దిశగా అమలుచేస్తున్న ప్రణాళికలు మంచి ఫలితాలు ఇవ్వడంలో, అన్ని రంగాల్లోనూ 15 శాతం సుస్థిర, సమ్మిళిత వృద్ధి సాధనలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో లీడ్ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్షా కమిటీ సమావేశం జరిగింది.