News May 29, 2024
కృష్ణా: ‘పొరపాట్లకు అస్కారం లేకుండా పోస్టల్ ఓట్ల లెక్కింపు’

పొరపాట్లకు అవకాశం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును సక్రమంగా చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై అవగాహన కల్పించారు. కృష్ణా వర్సిటీలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్, తర్వాత EVM ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
Similar News
News April 24, 2025
మచిలీపట్నం: నేడు జిల్లా సమీక్షా మండలి సమావేశం

కృష్ణాజిల్లాలో మండల సమీక్షా సమావేశం గురువారం మచిలీపట్నంలో జరగనుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సురేష్ అధ్యక్షతన ఉదయం 10.30ని.లకు జడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, ప్రజా ప్రతినిథులు పాల్గొననున్నారు. అధికారులు తమ శాఖలకు చెందిన ప్రగతి నివేదికలతో హాజరు కావాలని చెప్పారు.
News April 24, 2025
మచిలీపట్నం: ‘హోంగార్డ్ సంక్షేమానికి కృషి చేస్తాం’

పోలీస్ శాఖలో అంతర్భాగంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్స్ సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామని కృష్ణాజిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆర్ గంగాధరరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో హోంగార్డ్స్ సమస్యల పరిష్కారానికి దర్బార్ నిర్వహించారు. హోంగార్డుల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.
News April 23, 2025
కృష్ణా: టెన్త్ ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య

కృష్ణా జిల్లా బంటుమిల్లి(M) అర్జువానిగూడెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పదో తరగతిలో ఉత్తీర్ణత కాలేదని విద్యార్థి గోవాడ అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతేడాది అనిల్ సైన్స్ పరీక్ష ఫెయిల్ అయ్యాడు. ఈ ఏడాది కూడా అదే సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. విగతజీవిగా మారిన కుమారుడ్ని చూసి తల్లిదండ్రలు రామకృష్ణ, రజినీ గుండెలవిసేలా రోదించారు.