News September 26, 2024
కృష్ణా: ప్రయాణీకుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా భువనేశ్వర్(BBS), యశ్వంత్‌పూర్(YPR) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.02811 BBS-YPR ట్రైన్‌ను అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి శనివారం, నం.02812 YPR-BBS ట్రైన్‌ను అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News November 24, 2024
బుడమేరుకు మళ్లీ గండ్లు.. అధికారుల స్పందన
బుడమేరుకు సెప్టెంబర్‌లో గండ్లు పడ్డ ప్రాంతంలో మళ్లీ గండ్లు పడ్డాయని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతుండగా.. వాటిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్‌లో స్పందించింది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్టులు పెడుతున్న వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని తమ అధికారిక ఖాతాలో తాజాగా హెచ్చరించింది. ఈ తరహా పోస్టులతో ప్రజలలో అలజడి రేపుతున్నారని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
News November 24, 2024
విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఏలూరు కాలువలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లిదండ్రులతో పాటు కాలువలో బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఈ క్రమంలో పిల్లలు కాలువలో దిగి ఆడుతూ లోతుకి వెళ్లారు. వారిని బయటకి తీసుకువచ్చే లోపు వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 24, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. రేపటితో ముగియనున్న గడువు
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో వివిధ పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(Y20 నుంచి Y24 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 28 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారంలోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, ఫీజు పేమెంట్ వివరాలకై https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ కోరింది.