News November 20, 2024
కృష్ణా: బీ- ఫార్మసీ పరీక్షల ఫలితాల విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో ఇటీవల నిర్వహించిన బీ-ఫార్మసీ కోర్సు 4, 6వ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్సిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News December 3, 2024
కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు(2023 – 24 విద్యా సంవత్సరం) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. డిసెంబర్ 18 – 2025 జనవరి 3 మధ్య నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. సబ్జెక్టువారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని KRU సూచించింది.
News December 3, 2024
విద్యావ్యవస్థకే అతిపెద్ద పండుగ: కలెక్టర్ లక్ష్మి షా
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7న పాఠశాల విద్యావ్యవస్థకే అతిపెద్ద పండగగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించనుందని కలెక్టర్ లక్ష్మి షా తెలిపారు. మంగళవారం విజయవాడ మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సన్నద్ధతపై ఎంఈవోలతో పాటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని డీఈఓ సుబ్బారావు కోరారు.
News December 3, 2024
విజయవాడలో రెండు దశలుగా మెట్రో రైలు ప్రాజెక్టు
విజయవాడలో 2 దశలుగా మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొదటి దశలో 2 కారిడార్‌లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా రూపొందించిన DPRను కేంద్రానికి పంపనుంది. మొదటి దశలోని కారిడార్ 1Aలో గన్నవరం-పండిట్ నెహ్రూ బస్టాండ్(PNBS), కారిడార్ 1Bలో PNBS- పెనమలూరు, 2వ దశలోని కారిడార్ 3లో PNBS-అమరావతి మధ్య మెట్రో నిర్మించేలా DPR తయారైందని తెలుస్తోంది.