News February 19, 2025
కృష్ణా యూనివర్సిటీ వీసీగా పొందూరు వాసి

పొందూరు మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన కూన రాంజీ విజయవాడలోని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదలయ్యాయి. గతంలో ఆయన ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. ఈయన నియామకంపై పొందూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
Similar News
News February 22, 2025
శ్రీకాకుళం: జిల్లాను ప్రగతి పథంలో తీసుకువెళ్లాలి

జిల్లాను ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్, స్థాయి సంఘాల అధ్యక్షురాలు పిరియా విజయ అన్నారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో 2వ, 4వ, 7వ స్థాయి సంఘాల సమావేశం జరిగింది. జిల్లా అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు హాజరయ్యారు.
News February 21, 2025
SKLM: వయసు 23.. 12 దొంగతనం కేసులు

శ్రీకాకుళంలో గంజాయితో శుక్రవారం నలుగురు యువకులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. చదువుపై దృష్టిని సారించాల్సిన యువకులు తప్పటడుగులు వేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్నారు. అరెస్టయిన వారిలో ధర్మాన ప్రవీణ్(23)పై ఏకంగా 12 దొంగతనం కేసులు ఉన్నాయి. ఇటీవల జైలుకు వెళ్లొచ్చాడు. యోగేశ్వర రావు, జలగడుగుల తార వికాస్‌పై గతంలో గంజాయి కేసులు ఉండటంతో జైలుకెళ్లారు.
News February 21, 2025
అచ్చెన్న అబద్ధాలు చెప్పడం తగదు: ధర్మాన కృష్ణ దాస్

వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని శాఖలకు మంత్రి స్థానంలో ఉండి అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పడం తగదని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధరలు లేక సతమతం అవుతుంటే గత ప్రభుత్వంలో రేటు పలికిందా? అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.