News January 9, 2025

కృష్ణా: రేపటి నుంచి సెలవులు

image

కృష్ణా విశ్వవిద్యాలయం విద్యార్థులకు శుక్రవారం నుంచి సెలవులు రానున్నాయి. పీజీ విద్యార్థుల పరీక్షలు గురువారం ముగియడంతో విద్యార్థులు సెలవుల మూడ్‌లోకి వెళ్లనున్నారు. రెండో శనివారం, ఆదివారం సెలవు దినం కావడంతో ఆ రెండు రోజులు యూనివర్సిటీకి శెలవు ప్రకటించారు. సోమవారం నుంచి శనివారం వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చినట్లు వర్సిటీ యాజమాన్యం తెలిపింది. ఈ నెల 20 నుంచి కృష్ణా వర్సిటీ తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.

Similar News

News January 10, 2025

ఉయ్యూరు: G3 థియేటర్‌కు నోటీసులు

image

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ సందర్భంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో G3 శ్రీనివాస థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అర్ధరాత్రి 1 గంటకు ఈ థియేటర్ బెనిఫిట్‌ షో వేస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని థియేటర్ యాజమాన్యానికి ఉయ్యూరు టౌన్ పోలీసులు నోటీస్ ద్వారా తెలిపారు.

News January 10, 2025

పోరంకిలో మహిళ హత్య  UPDATE

image

పోరంకిలో రాణి హత్యకు గురైన ఘటనకు సంబంధించి పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. రాణి కూతురు భర్త నరేశ్‌తో విభేదాల కారణంగా తన కూతురిలో తల్లి వద్దే ఉంటోంది. అయితే వారి కూతురి బడికి పంపకుండా మాల్‌లో పనికి పంపేవారు. ఈ విషయంపై అల్లుడు గురువారం అత్త ఇంటికొచ్చి తన కూతురిని చదివించకుండా పనికి పంపుతున్నారంటూ హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామన్నారు. 

News January 10, 2025

ఆ సమాచారం తెలిస్తే ఈ నెంబరుకు ఫోన్ చేయండి: సీపీ

image

గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశాలు, వ్యక్తులు, వాహనాల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ రాజశేఖరబాబు సూచించారు. ఆ సమాచారం ఇచ్చేందుకు 1972 లేదా 112 నెంబరుకు కాల్ చేయాలని ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సీపీ రాజశేఖరబాబు ఈ మేరకు యువతకు సూచించారు.