News June 29, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ, భద్రాచలం రోడ్ మధ్య ప్రయాణించే మెము ఎక్స్‌ప్రెస్‌లను ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు జూలై 1 నుంచి 31 వరకు నం.07278 భద్రాచలం రోడ్-విజయవాడ, నం.07279 విజయవాడ- భద్రాచలం రోడ్ మెము ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఆయా రైళ్ల రద్దు ప్రకటనను గమనించాలని సూచించారు.

Similar News

News September 20, 2024

రుణాల రీషెడ్యూలింగ్‌ దరఖాస్తులు తక్షణ పరిష్కారం: కలెక్టర్

image

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజల నుంచి వస్తున్న రుణాల రీ షెడ్యూల్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన తెలిపారు. పలు బ్యాంకుల అధికారులు, సబ్‌ కలెక్టరేట్‌లోని ఫెసిలిటేషన్‌ కేంద్రం ఈ విషయంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఒక్క రోజులోనే 615 ఖాతాలకు సంబంధించి రూ. 51.37 కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్‌ చేసినట్లు వెల్లడించారు.

News September 20, 2024

త్రోబాల్‌ ఉమ్మడి కృష్ణాజిల్లా జట్లు ఎంపిక

image

రాష్ట్ర స్థాయి త్రో బాల్‌ పోటీలకు ప్రాతినిథ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా జట్టును ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా త్రో బాల్‌ సంఘం కార్యదర్శి సులోచన తెలిపారు. పురుషుల జట్టుకు రవివర్మ, ప్రమోద్, చరణ్‌తేజ్, చరణ్‌సాయి, యశ్వంత్, రాము, సాయిసంతోష్, రాజ్‌దీప్, జ్యోతివర్మ, అక్షయ్, సూర్య, వెంకటేష్, భాస్కర్, జోసఫ్, అఖిల్, మహిళల జట్టుకు శ్రావణి, జోషిత, సాయిదుర్గ, దక్షిణి, నీరజ, దుర్గ, రితిక ఎంపికైనట్లు చెప్పారు.

News September 20, 2024

విజయవంతంగా ముగిసిన టూరిజం కాన్‌క్లేవ్-2024

image

విజయవాడ నోవాటెల్ హోటల్‌లో జరిగిన “ఏపీ- వియత్నాం టూరిజం కాన్‌క్లేవ్- 2024” శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సదస్సులో వియత్నాం తరపున ముఖ్య అతిథిగా హాజరైన హెచ్.ఈ.ఎంగ్యూయేన్‌కు రాష్ట్రంలోని పర్యాటక రంగ అంశాలను మంత్రి దుర్గేష్ వివరించారు. భవిష్యత్తులో ఏపీ- వియత్నాం మధ్య పర్యాటక, సాంస్కృతిక బదిలీకి మరింత బలం చేకూర్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని హాజరైన వియత్నాం ప్రతినిధులు హామీ ఇచ్చారు.