News April 6, 2024
కృష్ణా: రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్ల మృతి

దమ్మపేట మండలం మందలపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం, చీమలపాడు గ్రామానికి చెందిన చీపు లక్ష్మి(32), ఇద్దరు కూతుళ్లు శరణ్య(8), శాన్విక(6) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో భర్త రామకృష్ణ(35)కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 20, 2025
కోర్టుకెళ్లి నష్టపరిహారం వసూలు చేస్తా: ఎమ్మెల్యే

హైదరాబాద్ పరిధిలోని కొండాపూర్‌లో 39 ఎకరాల స్థల వివాదంలో హైడ్రా రంగంలోకి దిగింది. శనివారం పోలీసుల బందోబస్తుతో అక్కడికి చేరుకున్న అధికారులు, స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు. ఈ స్థలం ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు చెందినదని సమాచారం. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లి నష్టపరిహారం వసూలు చేస్తామని తెలిపారు.
News April 20, 2025
బంటుమిల్లి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

బంటుమిల్లి మండలం నారాయణపురం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మచిలీపట్నంకు చెందిన వాసాబత్తిన వీరాచారి (29) ,అనకాపల్లి ప్రసాద్ (28) రాజమండ్రి నుంచి బైక్ పై మచిలీపట్నం వస్తుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ ఇరువురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
News April 20, 2025
మచిలీపట్నం: అఘోరిపై ఆడిషన్ ఎస్పీకి ఫిర్యాదు

భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్కర్‌ను దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన అఘోరి శ్రీనివాసపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా సంఘం అధ్యక్షుడు దోవా గోవర్ధన్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వివి నాయుడుకు ఫిర్యాదు చేశారు.