News May 24, 2024
కృష్ణా: లా కోర్స్ విద్యార్థులకు గమనిక

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని LLB 4వ సెమిస్టర్ (2023-24 విద్యా సంవత్సరం) థియరీ (రెగ్యులర్& సప్లిమెంటరీ) పరీక్షలను జూన్ 28 నుంచి నిర్వహిస్తామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జూన్ 4వ తేదీలోపు అపరాధరుసుం లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫీజుల వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్‌ను తనిఖీ చేసుకోవాలని కోరాయి.
Similar News
News April 23, 2025
కృష్ణా: టెన్త్ ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య

కృష్ణా జిల్లా బంటుమిల్లి(M) అర్జువానిగూడెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పదో తరగతిలో ఉత్తీర్ణత కాలేదని విద్యార్థి గోవాడ అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతేడాది అనిల్ సైన్స్ పరీక్ష ఫెయిల్ అయ్యాడు. ఈ ఏడాది కూడా అదే సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. విగతజీవిగా మారిన కుమారుడ్ని చూసి తల్లిదండ్రలు రామకృష్ణ, రజినీ గుండెలవిసేలా రోదించారు.
News April 23, 2025
కాస్త మెరుగుపడ్డ కృష్ణా జిల్లా స్థానం

పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కృష్ణాజిల్లా స్థానం కొంతలో కొంత మెరుగుపడింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో 85.32% ఉత్తీర్ణతతో జిల్లా 10వ స్థానంలో నిలిచింది. గత రెండు సంవత్సరాలుగా జిల్లా 11వ స్థానానికి పరిమితమవుతూ వచ్చింది. 2022-23లో 74.67%, 2023-24 సంవత్సరంలో 90.05% ఉత్తీర్ణతతో 11వ స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది 20,776 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 17,726 మంది ఉత్తీర్ణులయ్యారు.
News April 23, 2025
10th RESULTS: 10వ స్థానంలో కృష్ణా జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా 85.32%తో రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. మొత్తం 20,776 మంది పరీక్షలు రాయగా 17,726 మంది పాసయ్యారు. 10,783 బాలురులో 8,998 మంది, 9,993 మంది బాలికలు పరీక్ష రాయగా 8,728 మంది పాసయ్యారు.