News April 5, 2025
కృష్ణా: వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై సోమవారం తీర్పు

గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై సోమవారం తీర్పు వెలువడనుంది. ఉంగుటూరు మండలం ఆత్కూరులో 8 ఎకరాల భూమి కబ్జా చేశారని వంశీపై కేసు నమోదు అయింది. వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌పై వాదనాలు పూర్తి అయ్యాయి. వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై సోమవారం కోర్టు తీర్పు వెలువరించనుంది.
Similar News
News April 6, 2025
నేగు మచిలీపట్నంలో శ్రీరామ శోభాయాత్ర

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈనెల 6వ తేదీన మచిలీపట్నంలో శ్రీరామ శోభా యాత్రను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక హిందూ కాలేజ్ నుంచి కోనేరు సెంటర్ వరకు నిర్వహించే ఈ శోభాయాత్రలో అశేష భక్తజనులు పాల్గొనున్నారు. శోభాయాత్ర కమిటీ ప్రతినిథులు ప్రజా ప్రతినిథులు, అధికారులు, నగర ప్రముఖులను స్వయంగా ఆహ్వానించారు. ఇందులో భాగంగా శనివారం కలెక్టర్ డీకే బాలాజీని కలిసి ఆహ్వానపత్రం అందజేశారు.
News April 5, 2025
మచిలీపట్నం: పీజీ సెట్ కోసం KUలో సమాచార కేంద్రం

పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల కోసం కృష్ణా విశ్వవిద్యాలయంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డా ఎల్. సుశీల తెలిపారు. పీజీ సెట్-2025కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈనెల 2 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
News April 5, 2025
కృష్ణా: బాబు జగ్జీవన్ రామ్‌కి కలెక్టర్ నివాళి

దేశానికి అపార సేవలందించిన మహా నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం మచిలీపట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ, జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తోందన్నారు.