News January 7, 2025

కృష్ణా: సంక్రాంతి స్పెషల్ రైళ్లు.. టైమింగ్స్ ఇవే.!

image

విజయవాడ మీదుగా సంక్రాంతి సందర్భంగా చర్లపల్లి(CHZ)-తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.02764 CHZ-TPTY రైలు ఈనెల 8,11,15న, నం.02763 TPTY-CHZ రైలు ఈనెల 9,12,16న నడుపుతామన్నారు. నం.02764 రైలు చర్లపల్లిలో పై తేదీలలో సాయంత్రం 6.55కి బయలుదేరి తరవాతి రోజు అర్ధరాత్రి 12.10కి విజయవాడ, ఉదయం 7.15కి తిరుపతి చేరుకుంటాయన్నారు. 

Similar News

News April 25, 2025

విజయవాడ: ఒకే జైలులో నలుగురు నిందితులు

image

విజయవాడ జిల్లా జైలులో కీలకమైన కేసులలో నిందితులుగా ఉన్న నలుగురు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సత్యవర్ధన్ అనే యువకుడి కిడ్నాప్ కేసులో మాజీ MLA వంశీ, జత్వాని కేసులో రిమాండ్ విధింపబడటంతో ఇంటెలిజెన్స్ విభాగ మాజీ అధిపతి PSR ఆంజనేయులు రిమాండ్ ఖైదీలుగా ఉండగా.. లిక్కర్ కుంభకోణం కేసులో రాజ్ కెసిరెడ్డి, ఇదే కుంభకోణంలో A8గా ఉన్న చాణక్యకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో పోలీసులు ఇదే జైలుకు తరలించారు.

News April 24, 2025

మైలవరం: బాలికపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

image

మైలవరానికి చెందిన యువకుడు అవినాశ్ తెనాలిలో ఏడవ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తెనాలి వన్ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికకు అవినాశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఇటీవల తెనాలి వచ్చిన అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 24, 2025

వత్సవాయి: తమ్ముడిని చంపిన అన్న

image

వత్సవాయి మండలం కాకరవాయిలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరగగా, అన్న కొండ ఇనుప రాడ్డుతో తమ్ముడు అర్జున్ తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అర్జున్‌ను విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. నిందితుడు కొండను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

error: Content is protected !!