News March 24, 2025
కెరమెరి: కుక్కకాటు.. బాలుడి మృతి

కుక్కకాటుతో 4ఏళ్ల బాలుడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కెరమెరికి చెందిన చౌహాన్ రుద్ర దాస్,సరోజ దంపతుల కుమారుడు రిషిని కొద్ది రోజుల కిందట కుక్క కరిచింది. అప్పుడు తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఇంటికొచ్చిన కొద్దిరోజులకు బాలుడిలో మళ్లీ రేబిస్ లక్షణాలు కనిపించాయి. దీంతో కాగజ్‌నగర్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.
Similar News
News March 27, 2025
సిరిసిల్ల: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట కృష్ణనాయక్ తండాకు చెందిన శివరాత్రి సాయి కృష్ణ (17) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొండగట్టు ఆంజన్నను దర్శించుకుని తిరిగి వస్తుండగా ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోడ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆటో టాప్‌పై కూర్చున్న సాయి కృష్ణ కింద పడటంతో పైనుండి ఆటో వెళ్ళింది. ఈ ప్రమాదంలోసాయి కృష్ణ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 27, 2025
ఏప్రిల్ 1: మారేవి ఇవే

ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
* రూ.12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ లేదు
* టీడీఎస్, టీసీఎస్ పరిమితుల్లో మార్పులు
* SBI, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు రివార్డుల్లో సవరణలు
* ఇన్‌యాక్టివ్ లేదా ఇతరులకు కేటాయించిన మొబైల్ నంబర్లకు నిలిచిపోనున్న యూపీఐ సేవలు
News March 27, 2025
ఒంగోలు: బాలల వనరుల కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

ప్రకాశం భవన్‌లో జిల్లా బాలల వనరుల కేంద్రాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా గురువారం ప్రారంభించారు. అనంతరం వెట్టి చాకిరి రహిత ప్రకాశం, బంగారు బాల్యం కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ మండ్రు ప్రవీణ్ కుమార్, పారా లీగల్ వాలంటీర్, బంగారు బాల్యం కమిటీ సభ్యులు ఎం.రమేశ్ బాబు పాల్గొన్నారు.