News May 17, 2024
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఎంపీ అభ్యర్థి నగేశ్
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి నగేశ్ శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పార్లమెంటు పోలింగ్ సరళి, తదితర అంశాలను ఆయనతో చర్చించారు. అదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మనం గెలవబోతున్నామని, అందుకు గాను ముందస్తు అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు పార్లమెంట్ కో ఇన్ఛార్జ్ అశోక్ ముస్తాపురే, జిల్లా బీజేపీ నాయకులు, తదితరులున్నారు.
Similar News
News January 26, 2025
ADB: నాగోబా స్పెషల్.. ఎందరొచ్చినా 22 పొయ్యిలే
ఆదిలాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. జాతరకు మెస్రం వంశీయులు వేలాదిగా తరలివస్తారు. కానీ వారు వంట చేసుకోవడానికి అక్కడ 22 పొయ్యిలను మాత్రమే వినియోగిస్తారు. అయితే ఈ పొయ్యిలను ఎక్కడపడితే అక్కడ పెట్టరు. ఆలయ ప్రాంగణంలోని గోడ లోపల వెలిగే దీపాలు వెలుగుల్లో మాత్రమే వాటిని ఏర్పాటు చేస్తారు. వంట పాత్రలు, వాటి మీద కప్పడానికి మూతలను సిరికొండలోని గుగ్గిల్ల వంశస్థులు తయారు చేస్తారు.
News January 26, 2025
ADB: బ్యాంకు లాకర్లో బంగారం ఆభరణాలు మాయం
ఆదిలాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్లో నుంచి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల బ్యాంకు ఉన్నతాధికారులు సాధారణ తనిఖీలు చేపట్టగా, బ్యాంకు లాకర్లో నుంచి 507.4 గ్రాముల బంగారు ఆభరణాలు మిస్సైనట్లు తనిఖీల్లో తేలింది. వీటి విలువ రూ. 29 లక్షల 20 వేలు ఉంటుంది. బ్యాంకు అధికారుల ఆదేశాల మేరకు బ్రాంచ్ మేనేజర్ గోవర్ధన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News January 26, 2025
ఇంద్రవెల్లి: పాము కాటుతో రైతు మృతి
పాము కాటుతో రైతు మృతి చెందిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మసాగర్‌కు చెందిన రైతు సాబ్లె గురుసింగ్ (60) పాము కాటుకు గురై మృతి చెందాడు. శనివారం చేనులో పని చేస్తుండగా పాము కాటు వేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.