News February 13, 2025

కేటిదొడ్డి: కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో తనిఖీలు

image

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటక – తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. కేటిదొడ్డి మండలం నందిన్నె చెక్ పోస్టు వద్ద వెటర్నరీ అధికారి‌ డాక్టర్ నవీన్ చంద్ర, ఎక్సైజ్ కానిస్టేబుల్ జగదీష్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి సరఫరా అయ్యే కోళ్లకు సంబంధించి వాహనాలను తనిఖీ చేశారు.

Similar News

News February 13, 2025

కోడి పందేలు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌కు చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కోడి పందేలు కలకలం రేపాయి. ఈ క్రమంలో పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఫామ్ హౌస్ నిర్వహణపై ఆయనను విచారించనున్నారు.

News February 13, 2025

దుబాయ్‌లో భారత్, పాక్ దిగ్గజ క్రికెటర్ల సందడి

image

ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా భారత్, పాక్ దిగ్గజ క్రికెటర్లు కప్‌తో దుబాయ్‌లో సందడి చేశారు. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న యువరాజ్, ఇంజమామ్, ఆఫ్రీదితో కలిసి దిగిన ఫొటోను నవజోత్ సింగ్ సిద్ధూ ట్వీట్ చేశారు. లెజెండ్స్ ఈజ్ బ్యాక్ అని, బెస్ట్ ప్లేయర్స్ అని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి CT హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. భారత్ – పాక్ మ్యాచ్ 23న దుబాయ్‌లో జరగనుంది.

News February 13, 2025

గుండెపోటుతో మార్కెట్ కమిటీ కార్యదర్శి మృతి

image

బిక్కనూర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి నరసింహులు (55) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాత రాజు చెప్పారు. స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నరసింహులు అకాల మరణం పట్ల మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, అఖిలపక్ష నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

error: Content is protected !!