News December 20, 2024
కేటీఆర్కు నిజాయితీ లేదు: మంత్రి సీతక్క
ఫార్ములా ఈ కార్ రేస్పై అసెంబ్లీలో చర్చ జరపాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఈరోజు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళితే తప్పు పట్టిన కేటీఆర్.. ఇప్పుడు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారని, తన సమస్యను రాష్ట్ర సమస్యగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, కేటీఆర్కు నిజాయితీ లేదని విమర్శించారు.
Similar News
News February 5, 2025
మట్టెవాడ క్రైం కానిస్టేబుల్కు ప్రశంసాపత్రం అందజేత
రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ జరిగిన దొంగతనాలను విశ్లేషించి చోరీలకు పాల్పడిన దొంగల వివరాలను సంబంధిత జిల్లాల పోలీస్ అధికారులకు సమాచారం అందిస్తున్న మట్టెవాడ క్రైం కానిస్టేబుల్ అలీకి వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ప్రశంసా పత్రం అందించారు. కేరళలోని తిరువనంతపురం, కొచ్చికి చెందిన పోలీస్ కమిషనర్లతో పాటు వికారాబాద్ ఎస్పీ అలీని అభినందిస్తూ తెలుపుతూ జారీ చేసిన ప్రశంసాపత్రాలను సీపీ అందజేశారు.
News February 5, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.
News February 5, 2025
కొమ్మాలలో అద్భుతం.. సూర్య కిరణాల మధ్య లక్ష్మీనరసింహస్వామి
గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండు గుట్టల నడుమ ఉన్న నరసింహస్వామి విగ్రహాలను బుధవారం ఉదయం పూజా సమయంలో సూర్యకిరణాలు తాకాయి. సూర్యకిరణాల తాకిడితో నరసింహస్వామి ప్రతిబింబం మెరుస్తూ కనిపించింది. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు.