News April 10, 2024

కేయూ డిగ్రీ కోర్సుల పరీక్షల టైం టేబుల్

image

KU పరిధి డిగ్రీ కోర్సుల పరీక్షలకు సంబంధించి KU పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి నోటిఫికేషన్ విడుదల చేశారు. BA, Bcom, BSC, BCA BBA BA(ఎల్ఎం)కు సంబంధించిన 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. 2వ సెమిస్టర్ పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 23, 25 తేదీలలో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

Similar News

News October 10, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> నేటి నుంచి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు
> ఖమ్మం, రఘునాథపాలెం మండలాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
> అశ్వరావుపేట మండలం వినాయకపురం ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగ
> భద్రాచలం: విజయలక్ష్మి అవతారంలో దుర్గాదేవి
> ఖమ్మం టూ టౌన్‌లో సీపీఎం శాఖ సమావేశం
> ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన

News October 10, 2024

విద్యకు గుమ్మంగా ఖమ్మం జిల్లా: తుమ్మల

image

విద్యకు గుమ్మం ఖమ్మం జిల్లా అని, ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చదువుల కేంద్రంగా ఖమ్మం జిల్లాను తీర్చిదిద్దామని అధికారులకు మంత్రి సూచించారు. బుధవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్, సీపీ సునీల్‌దత్‌లతో సమావేశం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్ స్కూల్‌ కాంప్లెక్స్‌ శంకుస్థాపనకు సిద్ధం చేయాలని ఆదేశించారు.

News October 10, 2024

ఖమ్మం: ‘ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లులపై చర్యలు’

image

ఖమ్మంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పక్కదారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజ తెలిపారు. గత రబీ, ఖరీఫ్‌కు సంబంధించి రైతుల నుంచి ధాన్య సేకరణ చేసిన అనంతరం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే ధాన్యాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించలేదు. దీంతో ఆయా మిల్లులపై చర్యలు చర్యలు తీసుకుంటామని అన్నారు.