News February 26, 2025
కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు 5 రోజులు సెలవులు..

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు నేటి నుంచి మార్చి 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26 శివరాత్రి, 27 మహాశివరాత్రి జాగరణ, 28 అమావాస్య, 1 వారాంతపు సెలవు, 2 ఆదివారం వారాంతపు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. కావున రైతులు గమనించాలని కోరారు.
Similar News
News February 26, 2025
వెండితెరపై ‘శివుడు’

టాలీవుడ్‌లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విష్ణువు పాత్రలతో పాటు శివుడి పాత్రలోనూ స్టార్ హీరోలు అలరించారు. ఎన్టీఆర్(దక్షయజ్ఞం), కృష్ణంరాజు (శ్రీ వినాయక విజయం), శోభన్ బాబు(పరమానందయ్య శిష్యుల కథ), మెగాస్టార్ చిరంజీవి(శ్రీ మంజునాథ), జగపతిబాబు(పెళ్లైన కొత్తలో-సాంగ్‌లో) భోళా శంకరుడి పాత్రలో కనిపించారు. వీరిలో ఎవరు శివుడి పాత్రలో మెప్పించారో కామెంట్ చేయండి?
News February 26, 2025
గుడివాడ: డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్‌కు తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ చేరేలా చూడాలన్నారు.
News February 26, 2025
చింతలమానేపల్లిలో రూ.19లక్షల మద్యం స్వాధీనం

మండలంలోని గూడెం గ్రామంలో భారీగా మద్యం పట్టుకున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా గూడెం గ్రామంలో తనిఖీలు చేశామన్నారు. గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.19 లక్షల విలువైన మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం పలువురిపై కేసు నమోదు చేశామన్నారు.