News April 18, 2025

కేసీఆర్ సెంటిమెంట్.. WGL, KNR మధ్యలో BRS సభ

image

KCR సెంటిమెంట్ జిల్లాలైన KNR, WGL జిల్లాల మధ్యలో ఈనెల 27న BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 20లక్షల మందితో 1500ఎకరాల్లో సభ ఏర్పాటు చేయనున్నారు. 50వేలకు పైగా వాహనాలు వస్తాయనే అంచనాతో 169ఎకరాలు సభకు, మిగతాదంతా(1,331) పార్కింగ్‌కు కేటాయించారు. 300 LED స్క్రీన్లు, 15లక్షల మజ్జిగ, 15లక్షల వాటర్ ప్యాకెట్లు, తాత్కాలిక ఆస్పత్రి, అంబులెన్సులు, 4 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Similar News

News December 15, 2025

నరసరావుపేట కలెక్టరేట్‌లో పొట్టి శ్రీరాములుకు నివాళి

image

నరసరావుపేట కలెక్టరేట్‌లో సోమవారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీరాములు సేవలను వారు కొనియాడారు. కార్యక్రమంలో అధికారులు, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.

News December 15, 2025

NLG: మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో?!

image

నల్గొండ జిల్లాలో 8, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6, సూర్యాపేట జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 427 వార్డులు.. 6,61,113 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మున్సిపాలిటీలకు జనవరి 25, 2025న గడువు ముగిసింది. అప్పటినుంచి పాలకవర్గాలు లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 15, 2025

నిజామాబాద్: నేటితో ముగియనున్న 3వ విడత ఎన్నికల ప్రచారం

image

నిజామాబాద్ జిల్లాలో 3వ విడత ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల్లో 17న ఎన్నికలు జరగనున్నాయి.165 సర్పంచ్ స్థానాల్లో 19 ఏకగ్రీవం కాగా 146 సర్పంచ్, 1,620 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తంగా 3,26,029 మంది ఓటర్లు ఉన్నారు.