News March 4, 2025

కైకలూరు: కూలి పనులకు వెళ్లి పాముకాటుకు గురైన యువకుడు

image

కూలి పనికి వెళ్లిన యువకుడు పాముకాటుతో మృతి చెందాడు. మండలంలోని శృంగవరప్పాడు గ్రామానికి చెందిన జయమంగళ జాన్ పదో తరగతి పూర్తి చేశాడు. గుంటూరు(D) అమరావతిలో చేపల పట్టుబడికి ఆదివారం సాయంత్రం 11 మంది గ్రామస్థులతోపాటు మత్స్యకార కూలీగా అతనూ వెళ్లాడు. వీరంతా అర్ధరాత్రి సమయంలో అక్కడకు చేరుకోవడంతో పాకలో నిద్రపోయారు. నిద్రలో ఉన్న జాన్‌ను విషసర్పం కాటు వేసింది. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News March 4, 2025

ఆదోనికి పోసాని కృష్ణమురళి

image

AP: గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని ఆదోని PSకు తరలిస్తున్నారు. అక్కడ ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో పీటీ వారెంట్ దాఖలు చేసి తీసుకెళ్తున్నారు. మరోవైపు, నరసరావుపేట కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ వేయగా దానిపై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. రాజంపేట జైలులో ఉన్న ఆయన్ను నిన్న పోలీసులు పీటీ వారంట్‌పై నరసరావుపేట తీసుకురాగా, జడ్జి 10 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

News March 4, 2025

ఏలూరు: ఎమ్మెల్సీగా గెలిచిన కూటమి అభ్యర్ధి పేరాబత్తుల 

image

ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించారు. ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చేతుల మీదుగా ఆయన గెలుపు పత్రం అందుకున్నారు. రాజశేఖరం వెంట ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఉన్నారు. రాజశేఖరం గెలుపుతో కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

News March 4, 2025

నల్గొండ: ఓటు హక్కు కలిగిన ఏకైక అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి

image

WGL, KMM, NLG టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో ప్రభుత్వ టీచర్‌గా చేసినవాళ్లు తక్కువ మంది. అయినప్పటికీ ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ఏకైక అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి మాత్రమే. ఆయన ఎన్నికలకు ముందు తన ఉపాధ్యాయ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఓటు మాత్రం ఆరు నెలల వరకు ఉంటుంది. నర్సిరెడ్డి, సర్వోత్తమ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కూడా టీచర్‌గా పదవీ విరమణ చేశారు.

error: Content is protected !!