News September 9, 2024
కైలాసగిరిపై బస్సుకు బ్రేక్ ఫెయిల్

విశాఖ కైలాసగిరి కొండపై సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపై నుంచి కిందకు దిగుతున్న బస్సుకు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి మొదటి మలుపు వద్ద గోడను ఢీకొట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 16 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 11, 2025
విశాఖ ఎదగడానికి పోర్టే కారణం: సీఐటీయూ

విశాఖ అభివృద్ధిలో పోర్టు కీలకపాత్ర పోషిందని సీఐటీయూ నాయకులు అన్నారు. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉండే విశాఖ ఈరోజు మహానగరంగా ఆవిర్భవించడానికి పోర్టే కారణమన్నారు. ఈ సంవత్సరం రూ.800 కోట్లు, గతేడాది రూ.386 కోట్లు లాభాలతో నడుస్తుందని వెల్లడించారు. నేటికి కూడా రూ.171.42కోట్లు వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వం ఆర్జిస్తుండగా.. పోర్ట్ హాస్పిటల్‌ను అమ్మడం దారుణమన్నారు. ఈమేరకు రిలే నిరాహార దీక్షలో వారు మాట్లాడారు.
News March 11, 2025
ఎన్నారై మహిళ మృతి కేసులో డాక్టర్‌కు రిమాండ్

విశాఖలోని మేఘాలయ హోటల్‌లో <<15708620>>ఎన్నారై మహిళ మృతి<<>> కేసులో డా.శ్రీధర్‌ను విశాఖ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అమెరికాలో ఫ్రీలాన్స్ డాక్టర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ సదరు మహిళతో పరిచయం పెంచుకున్నాడు. నెల రోజుల క్రితం అతను విశాఖ రాగా.. ఆ తర్వాత మహిళ కూడా వచ్చింది. వీరిద్దరూ ఒకే హోటల్ గదిలో ఉండగా.. ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి శ్రీధర్‌ను రిమాండ్‌కు తరలించారు.
News March 11, 2025
ఇనాం భూముల సమస్యలు పరిష్కరించండి: గంటా

ఇనాం భూముల సమస్యలను పరిష్కరించాలని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో కోరారు. ఆ భూములపై యాజమన్య హక్కులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వారి ఆధీనంలో ఉన్నా సరే పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకొని మధ్యే మార్గంగా సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుందన్నారు.