News April 13, 2025

కైలాసపట్నంలో మృతి చెందిన వారి వివరాలు ఇవే

image

అనకాపల్లి జిల్లా కైలాసపట్నం మందు గుండు తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతి చెందిన వారిలో అప్పికొండ తాతబాబు(50), సంగరాతి గోవిందు(45), దాడి రామలక్ష్మి(38), దేవర నిర్మల(38),పురం పాప(40),గుంపిన వేణుబాబు(40),సేనాపతి బాబురావు(56), మనోహర్ ఉన్నారు. మరికొద్ది సేపటిలో హోం మంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలానికి రానున్నారు.

Similar News

News April 16, 2025

కాంగ్రెస్ కుంభకోణాల్ని ప్రజలు మర్చిపోలేదు: కిషన్ రెడ్డి

image

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను ఈడీ చేర్చిన అంశంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేయడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘కాంగ్రెస్ నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలి. ధర్నాలు చేసినంత మాత్రాన వారి అవినీతి, అక్రమాలు సమసిపోవు. ప్రజలింకా బోఫోర్స్, బొగ్గు, 2జీ స్పెక్ట్రమ్, హెలికాప్టర్ల కుంభకోణాల్ని మర్చిపోలేదు. ఈ కేసు విచారణ జరగాలని కోర్టులు తేల్చి చెప్పాయి’ అని పేర్కొన్నారు.

News April 16, 2025

మొదటి విడతలో 3,23,453 మంది లబ్ది: జేసీ

image

అనకాపల్లి జిల్లాలో దీపం పథకం కింద మొదటి విడతలో 3,23,453 మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేసినట్లు జాయింట్ కలెక్టర్ జాహ్నవి తెలిపారు. ఈనెల 1వ తేదీ నుంచి రెండవ విడతలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందవచ్చునన్నారు. ఈ మేరకు ఆమె బుధవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు ఉచితంగా గ్యాస్ పొందేందుకు గడువు ఉందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News April 16, 2025

పెన్‌పహాడ్ ఠాణాను సందర్శించిన జిల్లా ఎస్పీ

image

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను బుధవారం జిల్లా ఎస్పీ నరసింహ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మండలంలోని శాంతిభద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని సూచించారు.

error: Content is protected !!