News April 2, 2025

కొండగట్టు : అంజన్న సన్నిధిలో దీక్షలు స్వీకరణ

image

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నేడు పలు జిల్లాలకు చెందిన భక్తులు హనుమాన్ మాల స్వీకరించారు . స్థానిక ఆలయ అర్చకులు పవన్, అనిల్, శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో 11 రోజులు పాటు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈ రోజు మాల వేసుకున్న స్వాములు చిన్న జయంతికి విరమణ చేస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం దీక్ష స్వాములు అంజన్నను దర్శించుకున్నారు .

Similar News

News April 4, 2025

కొడంగల్: ‘ఆస్తిపన్ను వసూళ్లలో రికార్డు’

image

ఆస్తిపన్ను వసూళ్లలో కొడంగల్ మున్సిపాలిటీ రికార్డు సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను 82.88 శాతం పన్ను వసూలు చేసినట్లు కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ టి కె. శ్రీదేవి చేతులమీదగా కమిషనర్ బలరాం నాయక్ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.

News April 4, 2025

మోడల్ సోలార్ గ్రామాన్ని గుర్తించండి: కలెక్టర్

image

ప్రధానమంత్రి సూర్య ఘర్‌ యోజనతో మోడల్ సోలార్ గ్రామాన్ని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్‌లో రెడ్కో జిల్లా మేనేజర్, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, ఎల్‌డిఎం నరసింహమూర్తి, ఎస్సీ ట్రాన్స్‌కో శంకర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 5వేల జనాభా గల గ్రామాన్ని ఎంపిక చేయాలన్నారు.

News April 4, 2025

నిజామాబాద్: దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో గ్రామ పాలనాధికారులుగా పని చేయడానికి ఆసక్తి కలిగిన మాజీ వీఆర్ఓలు, వీఆర్ఎలు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 16వ తేదీ లోగా గూగుల్ ఫామ్ https://forms.gle/AL3S8r9E2Dooz9Rc7లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం https://ccla.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కలెక్టర్ సూచించారు.

error: Content is protected !!