News March 19, 2025
కొండగట్టు అంజన్న సేవలో ఎమ్మెల్సీ చిన్నమలై అంజిరెడ్డి

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమలై అంజి రెడ్డి కుటుంబ సమేతంగా కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదోచ్చరణతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏసిఎస్ రాజు, భావన ఋషి, మేన మహేశ్ బాబు, బండారి మల్లికార్జున్, మల్యాల మండల సీనియర్ నేత ప్రసాద్, బిట్టు పాల్గొన్నారు.
Similar News
News March 19, 2025
హాస్టల్‌లో మెరుగైన సౌకర్యాలు ఉండాలి: హనుమకొండ కలెక్టర్

హాస్టల్‌లో విద్యార్థులకు సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ నయీమ్ నగర్‌లోని బీసీ సంక్షేమ హాస్టల్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు?, సౌకర్యాలు ఎలా ఉన్నాయని బీసీ సంక్షేమ అధికారి రామ్ రెడ్డి, హాస్టల్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
News March 19, 2025
గుంటూరు: వక్కపొడి సంస్థ కార్యాలయాలపై దాడులు

గుంటూరులోని ఓ ప్రముఖ వక్కపొడి సంస్థ కార్యాలయాలపై నిన్నటి నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. బుధవారం కూడా ఐటీ దాడులు కొనసాగాయి. గుంటూరులోని ఆ సంస్థ ఛైర్మన్ నివాసంలోనూ, ఆయన బంధువుల ఇళ్లలోనూ, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. తనిఖీల్లో 40కిలోల బంగారం, 100 కిలోల వెండి, రూ.18లక్షల నగదు సీజ్ చేసినట్టు సమాచారం. వక్కపొడి ఫ్యాక్టరీలోనూ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.
News March 19, 2025
MHBD: పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్

మహబూబాబాద్ జిల్లా పరిధిలో జరిగే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ యాక్ట్ 2023 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల సందర్భంగా కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఇద్దరికీ మించి గుంపులుగా ఉండరాదని సూచించారు. అదేవిధంగా ఎలాంటి సభలు సమావేశాలు ర్యాలీలకు మైకులు డీజేలతో ఊరేగింపులు ధర్నాలు, ప్రచారాలు నిర్వహించొద్దని పేర్కొన్నారు.