News February 6, 2025
కొండపాక: సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738825255948_52021735-normal-WIFI.webp)
కొండపాక మండలంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని బియ్యం, నిత్యావసర వస్తువులు, వంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులకు సూచించారు.
Similar News
News February 6, 2025
తెలుగులోనూ జీవోలు.. ఇలా చూసేయండి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738846683684_367-normal-WIFI.webp)
AP: రాష్ట్ర ప్రభుత్వం అధికార సైట్‌లో ఇంగ్లిష్‌తో పాటు తెలుగులో జీవోలను అప్‌లోడ్ చేస్తోంది. <
News February 6, 2025
స్కూల్‌లో ఫైర్.. 17 మంది చిన్నారులు సజీవదహనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738844882889_1032-normal-WIFI.webp)
నైజీరియాలోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. జంఫారా స్టేట్ కైరా నమోదాలోని ఓ ఇస్లామిక్ స్కూల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బడిలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ పక్కనే నిల్వ ఉంచిన కర్రలకు మంటలు అంటుకుని ప్రమాదం సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
News February 6, 2025
మల్లన్నకు షోకాజ్ నోటీసులు, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738847132532_367-normal-WIFI.webp)
TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఒక కులాన్ని దూషించడం, కులగణన నివేదికను దహనం చేయడంపై పార్టీ సీరియస్ అయింది. ఎమ్మెల్సీగా ఉండి పార్టీ రాజ్యాంగాన్ని, విధానాలను అతిక్రమించారని అందులో పేర్కొంది. షోకాజ్ నోటీసులకు ఫిబ్రవరి 12లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.