News March 21, 2024

కొండపి: తొలిరౌండ్ పొగాకు అమ్మకాలు పూర్తి

image

కొండపిలోని వేలం కేంద్రంలో తొలిరౌండ్ పొగాకు అమ్మకాలు బుధవారంతో పూర్తయ్యాయని వేలం నిర్వహణాధికారి జి.సునీల్ కుమార్ తెలిపారు. రెండో రౌండ్ గురువారం నుంచి మొదలవుతుందన్నారు. ఇందులో బ్యారన్‌కు 4బేళ్ల చొప్పున విక్రయాలకు అనుమతించామన్నారు. రైతులు గ్రేడింగ్ సరిగ్గా చేసుకొని బేళ్లను వేలానికి తీసుకువచ్చి గిట్టుబాటు ధరలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 14, 2025

పొదిలి: బలవర్మరణం కేసులో ట్విస్ట్

image

పొదిలి పట్టణంలో గత ఏడాది రవి అనే వక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈకేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. దళితనేత నీలం నాగేంద్రం జిల్లా ఎస్పీ దామోదర్‌ను మృతుడి భార్య సలొమితో కలిసి ఎస్సీ, ఎస్టీ కేసుగా మార్చాలని చేసిన విజ్ఞప్తి మేరకు విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం కేసును సోమవారం ఎస్సీ, ఎస్టీ కేసుగా మార్చారు.

News January 13, 2025

పర్చూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్.. మరొకరు మృతి

image

ఇటీవల పర్చూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి సజీవ దహనమైన అక్కాచెల్లెళ్ల గురించి మరువక ముందే వారి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతుళ్లను కాపాడుకునే ప్రయత్నంలో కాలిపోయి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న తల్లి దాసరి లక్ష్మీరాజ్యం కూడా తనువు చాలించింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పర్చూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News January 13, 2025

గుడ్లూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

గుడ్లూరు మండలం చేవూరు జాతీయ రహదారిపై సోమవారం బైకు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. చెన్నై నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు చేవూరు వద్ద మోటర్ బైక్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు, కారులో పయనిస్తున్న అధ్విక రాజ్ అనే పాప అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను కావలి వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.