News February 11, 2025
కొండాపురం: ఉదయాన్నే తప్పిన పెను ప్రమాదం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739235828024_50090021-normal-WIFI.webp)
కొండాపురం మండలంలోని దత్తాపురం బస్టాప్ వద్ద మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ట్రావెల్స్ బస్సు, ఐచర్ వాహనాలు ఢీకొన్నాయి. విజయవాడ నుంచి అనంతపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, గుజరాత్ నుంచి కడపకు వెళ్తున్న ఐచర్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News February 11, 2025
కడప జిల్లాలో విషాదం.. తల్లి, కొడుకు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739256694781_60261505-normal-WIFI.webp)
కడప జిల్లా బి.కోడూరు మండలం గుంతపల్లిలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో తల్లి, కుమారుడు మృతి చెందారు. తల్లి గురమ్మ, కుమారుడు జయసుబ్బారెడ్డి పొలానికి నీళ్లు పెడుతుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బి.కోడూరు ఎస్ఐ రాజు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 11, 2025
కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ అవినాశ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739198241171_51961791-normal-WIFI.webp)
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, అణుశక్తి సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్‌ను కలిసి సమస్యలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు సమర్పించారు. చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లే రైలుకు కడపలో స్టాపింగ్ ఇవ్వాలని కోరారు. తిరుపతి నుంచి షిరిడీకి ప్రతిరోజు రైలు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పులివెందుల యురేనియం ఫ్యాక్టరీ సమస్యలను విన్నవించారు.
News February 10, 2025
బీటెక్ రవిని ప్రశ్నించిన విచారణాధికారి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739197265630_1041-normal-WIFI.webp)
తనని కడప జైల్లో డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించారని మాజీ మంత్రి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవిని విచారణాధికారి రాహుల్ శ్రీరామ్ ప్రశ్నించారు. జైలులో దస్తగిరి బ్యారక్‌లో బీటెక్ రవి ఉన్నారు. ఈ నేపథ్యంలో దస్తగిరి బ్యారక్‌లోకి చైతన్య రెడ్డి వెళ్లాడా.. లేడా అని విచారణాధికారి బీటెక్ రవిని ప్రశ్నించినట్లు సమాచారం