News April 7, 2024

కొండాపురం: బోల్తాపడ్డ ట్రాక్టర్.. దూకేసిన కూలీలు

image

కొండాపురం మండలం పార్లపల్లి సమీపంలోని పొలాల్లో పొగాకు లోడుతో ఉన్న ట్రాక్టర్ బోల్తాపడింది. ఆ సమయంలో ట్రాక్టర్ లో 15 మంది కూలీలు ఉన్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాళ్లు వెంటనే కిందికి దూకి తృటిలో ప్రాణాలు కాపాడుకున్నారు. లోడుతో ఉన్న ట్రాక్టర్ పొలంలోంచి రోడ్డుపైకి ఎక్కిస్తుండగా అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు అక్కడున్న వారు తెలిపారు.

Similar News

News January 11, 2025

ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇస్తాం: కలెక్టర్

image

నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని ఇతర పట్టణాల్లో ప్రైవేట్ బస్సులు నడిపేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే వెంటనే అనుమతిస్తామని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రాంతీయ రవాణా ఆథారిటీ సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరంలో ఇప్పటికే పర్మిట్ ఉన్న రూట్లు, నూతన రూట్లలో సిటీ బస్లు తిప్పుకునేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు అనుమతుల కోసం చేసిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు.

News January 10, 2025

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రూ. 10 లక్షల సాయం

image

తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు సభ్యులు వ్యక్తిగతంగా ఆర్థికసాయం చేశారు. కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ. 10లక్షలు ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా సుచిత్ర ఎల్ల రూ.10 లక్షలు, ఎంఎస్ రాజు రూ.3 లక్షలు తమ వంతు సాయం చేశారు.

News January 10, 2025

ఆత్మకూరులో రోడ్డు ప్రమాదం.. 10th Class విద్యార్థి మృతి

image

ఇసుక ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామానికి చెందిన జశ్వంత్ (15) పదో తరగతి చదువుతున్నాడు. బైక్‌పై ఆత్మకూరుకు వెళ్తున్న జశ్వంత్‌ను అప్పారావుపాలెం నుంచి ఇసుకలోడుతో ఆత్మకూరుకు వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి కింద పడి ఘటనా స్థలంలోనే జశ్వంత్ మృతి చెందాడు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.