News March 24, 2025
కొండాపూర్: ఆంగ్లం పరీక్షకు 99.8% హాజరు

పదో తరగతి ఆంగ్లం పరీక్షకు 99.8% హాజరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. మొత్తం 22,406 మందికి 22,362 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. జిల్లా పరిశీలకురాలు ఉషారాణి ఐదు, డీఈవో వెంకటేశ్వర్లు మూడు, అసిస్టెంట్ కమిషనర్ పండరీ నాయక్ ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 30, 2025
ప్రార్థన స్థలాల వద్ద పటిష్ట బందోబస్తు: బాపట్ల ఎస్పీ

రంజాన్ పండగ పురస్కరించుకొని ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే స్థలాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఎక్కడైనా అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కులమత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.
News March 30, 2025
కోల్‌కతా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

కేకేఆర్ ఫ్యాన్స్‌కు ఆ జట్టు కోచ్ చంద్రకాంత్ పండిట్ గుడ్ న్యూస్ చెప్పారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా ఆడని సునీల్ నరైన్ కోలుకున్నారని ఆయన తెలిపారు. రేపు వాంఖడేలో ముంబైతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. కాగా.. RRతో మ్యాచ్‌లో నరైన్ స్థానంలో ఆడిన మొయిన్ అలీ 2 వికెట్లు తీశారు.
News March 30, 2025
బైక్ ఎక్స్‌పెడిషన్ బృందానికి స్వాగతం

250వ AOC కార్పస్ డేను పురస్కరించుకుని బయలుదేరిన బైక్ ఎక్స్‌పెడిషన్ బృందాన్ని CAD పులగాన్ వద్ద ఉత్సాహంగా స్వాగతించారు. ఈ బృందం సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు 2200 కి.మీ ప్రయాణించి మార్గమధ్యలో వీర నారులు, వేటరన్లు, విద్యార్థులతో పరస్పర కలయిక సాధించనుంది. ఆ తర్వాత వీరిని అధికారికంగా ఫ్లాగ్ ఆఫ్ చేశారు.