News March 21, 2024

కొడంగల్: జానపద కళాకారుడికి సూర్య పర్వ్ అవార్డు

image

కొడంగల్ మండలంలోని చిట్లపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారుడు ప్రకాశ్‌ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ కల్చర్ టీం లీడర్‌గా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా అయోధ్యలో శ్రీ సీతారామ సన్నిధిలో సూర్య పర్వ్ అవార్డుతో సత్కరించారు. సూర్య పర్వ్ కార్యక్రమంలో దేశంలోని 18 రాష్ట్రాల కళాకారులు ప్రదర్శనలు నిర్వహించినట్లు ప్రకాశ్ తెలిపారు.

Similar News

News April 11, 2025

బాలానగర్: బావిలో దూసి మహిళ SUICIDE

image

బావిలో పడి మహిళ మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో చోటుచేసుంది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. లింగారం గ్రామానికి జంగమ్మ (35)కు కల్లు తాగే అలవాటు ఉండగా ఆమెను భర్త మందలించాడు. మనస్థాపానికి గురైనా ఆమె అందరూ గాఢ నిద్రలో ఉండగా.. గురువారం తెల్లవారుజామున వ్యవసాయ బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

News April 11, 2025

ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్లనిర్మాణానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తహశీల్దార్లు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మఇంటి నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించి తహశీల్దార్లకు పంపించాలన్నారు. 

News April 11, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

image

✔పలుచోట్ల ఈదురుగాలులతో వర్ష బీభత్సం
✔రేపు పూలే జయంతి వేడుకలు
✔నాగర్‌కర్నూల్: సిరసనగండ్ల రథోత్సవంలో లక్షల మంది
✔సళేశ్వరంలో ఆదివాసీ చెంచులే పూజారులు
✔KCR సభకు..BRS పార్టీ శ్రేణులకు పిలుపు
✔ఉమ్మడి జిల్లాల్లో జోరుగా వరి కోతలు
✔NGKL:చిన్నతగాదాతో భార్యాభర్తల సూసైడ్
✔IPL బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు:ఎస్సైలు
✔పలుచోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

error: Content is protected !!