News March 16, 2025
కొడుకు సూసైడ్.. మనస్థాపంతో తల్లి ఆత్మహత్య

రైలు కిందపడి కొడుకు మృతి చెందడం జీర్ణించుకోలేక తల్లి సైతం రైలు కిందపడి మరణించింది. తాడిపత్రికి చెందిన శ్రీచరణ్ ప్రేమ వివాహానికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ప్రసన్నాయిపల్లి వద్ద రైలు కిందపడి గురువారం సూసైడ్ చేసుకున్నాడు. అంత్యక్రియలు శుక్రవారం పూర్తిచేశారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి శైలజ శనివారం ఉదయం తాడిపత్రిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలు పలువురినీ కంటతడి పెట్టించాయి.
Similar News
News March 16, 2025
అనంతపురం: పొట్టి శ్రీరాములుకి ఘన నివాళి

అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, డీఆర్ఓ మాలోల, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
News March 16, 2025
10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశాం: DEO

10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు తెలిపారు. అనంతపురం జిల్లాలో 135 కేంద్రాల్లో 32,803 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు బాగా రాయాలని సూచించారు.
News March 16, 2025
అనంత జిల్లాలో చికెన్ ధరలు

అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. మటన్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. గుత్తిలో కేజీ మటన్ ధర రూ.750 పలుకుతోంది. అనంతపురంలో కేజీ చికెన్ ధర రూ.150 ఉండగా, గుత్తిలో కేజీ చికెన్ ధర రూ.170 నుంచి రూ.180కి కొంటున్నారు. గుంతకల్లులో కేజీ చికెన్ రూ.150 నుంచి రూ.160 ధర పలుకుతోంది. బర్డ్ ఫ్లూ కారణంగా గతవారం చికెన్ ధరలు తగ్గాయి.