News March 16, 2025

కొడుకు సూసైడ్.. మనస్థాపంతో తల్లి ఆత్మహత్య

image

రైలు కిందపడి కొడుకు మృతి చెందడం జీర్ణించుకోలేక తల్లి సైతం రైలు కిందపడి మరణించింది. తాడిపత్రికి చెందిన శ్రీచరణ్ ప్రేమ వివాహానికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ప్రసన్నాయిపల్లి వద్ద రైలు కిందపడి గురువారం సూసైడ్ చేసుకున్నాడు. అంత్యక్రియలు శుక్రవారం పూర్తిచేశారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి శైలజ శనివారం ఉదయం తాడిపత్రిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలు పలువురినీ కంటతడి పెట్టించాయి.

Similar News

News March 16, 2025

ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాయాలి: MP

image

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. జీవితంలో ఉన్నత చదువులకు తొలి మెట్టు పదవ తరగతి అని, ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

News March 16, 2025

ఆస్పత్రిలో సమంత.. అభిమానుల ఆందోళన

image

హీరోయిన్ సమంత మరోసారి ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటోను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సామ్‌కు మళ్లీ ఏమైంది, ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటూ టెన్షన్ పడుతున్నారు. కాగా సమంత కొంత కాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్’ చిత్రంలో నటిస్తున్నారు.

News March 16, 2025

గంజాయి అక్రమ రవాణాపై నిఘా: ఎస్పీ

image

గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారించినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తే నేరంగా పరిగణించి చట్ట పరిధిలో కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోందన్నారు. విద్యార్థులు, యువత, ప్రజలకు మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తామన్నారు.

error: Content is protected !!