News March 25, 2025
కొత్త క్యాబినెట్.. వరంగల్‌కు దక్కని అవకాశం!

మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈసారి ఛాన్స్ దక్కలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ అంశంపై ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే సీతక్క, సురేఖ మంత్రివర్గంలో ఉన్నారు. కాగా WGL జిల్లాకు చెందిన MLA, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తనకు మంత్రి పదవి కావాలని పార్టీ పెద్దలను పలుమార్లు కలిశారు. కానీ ఆయన పేరు కూడా లిస్టులో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నట్లు తెలిసింది.
Similar News
News March 31, 2025
వరంగల్: జాతరలో యువకుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో నిర్వహించిన గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘటనలో కుంతపల్లి గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సంగెం పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘర్షణలో పాల్గొన్న యువకుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
News March 31, 2025
భూపాలపల్లి: ‘కొలువుల ధీరుడు’కి 10వ ప్రభుత్వ ఉద్యోగం

చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన వెల్ది గోపికృష్ణ టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూపు-1 ఫలితాల్లో 493.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 70వ ర్యాంకర్‌గా నిలిచారు. కేంద్ర ప్రభుత్వంలో 07, రాష్ట్ర ప్రభుత్వంలో 3వ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం గోపికృష్ణ ఖమ్మం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా ఇటీవల ఆర్డర్ కాపీ తీసుకొని తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నాడు.
News March 31, 2025
పెద్దమ్మ తల్లి బోనమెత్తిన మంత్రి కొండా సురేఖ

పెద్దమ్మ తల్లి దీవెనలతో ప్రజలందరు బాగుండాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఖిలా వరంగల్ తూర్పు కోట పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఉగాది పండుగ సందర్భంగా జరిగే జాతరలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిధులుగా పాల్గొని ఎడ్ల బండిపై గుడి చుట్టూ ప్రదర్శన చేశారు. అనంతరం పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.