News March 10, 2025

కొత్తగూడెం: కాల్వలో పడి డిగ్రీ విద్యార్థి మృతి

image

మున్నేటిలో పడి డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగళ్లపల్లికి చెందని మహేశ్ ఖమ్మంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 8న స్నేహితులతో కలిసి కాల్వ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదైంది.

Similar News

News March 10, 2025

కలెక్టర్ క్రాంతిని కలిసిన ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని ఎస్పీ కలిశారు. ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకై కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

News March 10, 2025

నిజామాబాదులో ప్రజావాణికి 95 ఫిర్యాదులు

image

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీఓ శ్రీనివాస్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు.

News March 10, 2025

విజయవాడ: వల్లభనేని వంశీ కేసులో అప్డేట్

image

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌ వాయిదా పడింది. కౌంటర్‌ దాఖలుకు సత్యవర్ధన్‌ న్యాయవాది సమయం కోరారు. విచారణ అనంతరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. అలాగే వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ కూడా వాయిదా పడింది. వంశీ భద్రత రీత్యా బ్యారక్‌ మార్చలేమని అధికారులు న్యాయమూర్తికి వివరించారు. 

error: Content is protected !!