News March 11, 2025

కొత్తగూడెం: ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.

Similar News

News March 11, 2025

HYD: ఆరోగ్య సేవలకు ప్రత్యేక యాప్: MD 

image

ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో సోమవారం స‌త్వ‌ర ఆరోగ్య సేవ‌ల‌కు ప్ర‌త్యేక యాప్ ను ఎండీ అశోక్ రెడ్డి ప్రారంభించారు. జ‌ల‌మండ‌లి ఉద్యోగుల ఆరోగ్య సేవ‌ల కోసం ప్ర‌త్యేక యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. మెడ్ ఫ్లాష్ అనే మొబైల్ అప్లికేష‌న్ ద్వారా రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచిత సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చన్నారు. 

News March 11, 2025

అనంత: పోలీసు గ్రీవెన్స్‌కు 61 ఫిర్యాదులు: జిల్లా SP

image

అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌కు ప్రజల నుంచి 61 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. ప్రజల నుంచి ఆయన నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబందిత పోలీసు అధికారులకు పంపి బాధితులకు న్యాయం చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు.

News March 11, 2025

హీరోకు గాయం.. మరింత ఆలస్యం కానున్న ‘వార్-2’!

image

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వార్-2’ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది. ఈ చిత్రంలో స్టార్ హీరోల మధ్య ఓ సాంగ్ ప్లాన్ చేయగా తాజాగా రిహార్సల్స్‌లో హృతిక్ గాయపడినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మేలో ఈ పార్ట్ షూట్ చేస్తారని సమాచారం. దీంతో విడుదలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

error: Content is protected !!